Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగాపూర్ లో పంచాయతీ గ్రామ సభ

నాగాపూర్ లో పంచాయతీ గ్రామ సభ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని నాగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం సర్పంచ్ కంపదండి అశోక్ అధ్యక్షతన పంచాయతీ గ్రామ సభను నిర్వహించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయ వ్యాయాల వివరాలను పంచాయతీ కార్యదర్శి సంధ్య గ్రామ సభలో చదివి వినిపించారు.గ్రామంలో నీటి సరఫరా, వీధి దీపాలు, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇంటి పన్నుల వసూలు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, తదితర అంశాలపై గ్రామ సభలో చర్చించారు.

ఇందిరమ్మ ప్లాట్ ల గురించి గ్రామ సభలో ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు సర్పంచ్ అశోక్ తెలిపారు.ఈ సమావేశంలో ఉపసర్పంచ్ ఉల్లెంగల శశిధర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తిరుపతి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్, మాజీ వీడీసీ అధ్యక్షులు అశోక్, మాజీ ఉపసర్పంచ్ కృష్ణ మల్లయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -