తాపని పరస్తిలో మురికి కాల్వలు శుభ్రం చేస్తున్న వ్యక్తి
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సిబ్బంది సరిపడా లేకపోవడంతో మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మురికి కాలువలలో చెత్త చెదరం పెరుక్కుపోయింది. వర్షం కురిసిన సమయంలో రోడ్డుపైకి మురికి నీరు రావడంతో పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు చెప్పినా.. ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాకపోవడంతో స్థానికులు విసుగు చెంది వారి గల్లీలో ఉన్న మురికి కాలువలను తప్పని పరిస్థితిలో వారే శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య ఏర్పడడానికి గల కారణం స్థానిక ఎన్నికలు లేకపోవడం. ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులకు చెప్పినా.. పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామస్థులు పలుమార్లు గ్రామపంచాయతీలో మొరపెట్టుకున్న ఏమీ పట్టిపట్టానట్టుగా అధికారులు వ్యహరిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు కానీ సిబ్బంది కానీ స్పందించి మా సమస్యని తీరుస్తారని కాలనీవాసులు ఎదురుచూస్తున్నాము అని వాపోతున్నారు.
లోపించిన పారిశుద్ధ్యం..పట్టించుకోని పంచాయతీ అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES