- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జుక్కల్ పంచాయతీ కార్యదర్శుల సంఘం సభ్యులు తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ సెంట్రల్ ఫోరం డైరీ ఆవిష్కరించామని మండల జిపి కార్యదర్శుల సంఘం సభ్యులు తెలిపారు. గౌరవ అతిథిగా డిఆర్డిఓ సురేందర్ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. మొదటగా కార్యవర్గ సభ్యులకు అందరికీ శాలువాతో సన్మానించి జ్ఞాపికలు జుక్కల్ మండల కార్యదర్శుల సంఘం శాఖ ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము, పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం అసోసియేట్ అధ్యక్షులు డి శ్రీనివాస్ గౌడ్, మండల పంచాయతీ కార్యదర్శి అధ్యక్షుడు రమేష్ చారి, అశోక్ రాథోడ్, నాగనాథ్, అంజయ్య, వికా స్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
- Advertisement -



