Friday, February 27, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

- Advertisement -

నవతెలంగాణ-పెనుబల్లి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో సోమవారం విఎం బంజర ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రరావు బంజర గ్రామ పంచాయతీ కార్యదర్శి మాలోతు సోనాలి(26) దుర్మరణం చెందారు. మాలోతు సోనాలి మండల పరిధిలోని లక్ష్మా తండా నుంచి తన స్కూటీపై రామచంద్రరావు బంజరకు వస్తుండగా విఎం బంజర వద్ద లారీ డీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి మూడేండ్ల కుమారుడు, ఏడాది బాబు ఉన్నాడు. పెనుబల్లి ఎస్‌ఐ వెంకటేష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -