నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించి హాస కొత్తూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గా బదిలీపై వెళ్తున్న నవీన్ గౌడ్ ను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నవీన్ గౌడ్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో నవీన్ గౌడ్ అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఏ గ్రామంలో విధులు నిర్వర్తించిన ప్రజలకు మంచి సేవలందించి పేరు ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించారు.జైడి శ్రీనివాస్ రెడ్డి, సామ భూమారెడ్డి, సామ మహిపాల్, బట్టల సతీష్, గట్టు హన్మాండ్లు, సందీప్, మహేందర్, చరణ్, నాగరాజు, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.
బదిలీపై వెళ్తున్న పంచాయతీ కార్యదర్శికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES