నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో పందుల నివాసాలేర్పాటుతో దుర్వాసన వెదజల్లుతోందని..నివాసాలను తోలగించాలని ఈ నెల 4న పలువురు గ్రామస్తులు ఎంపీడీఓకు వినతిపత్రమందజేశారు.ప్రభుత్వ భూమిలో ఏర్పాటుచేసిన పందుల అవాసాలను తొలగించాలని ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శికి అధేశాలిచ్చారు. ఎంపీడీఓ అధేశాలిచ్చి వారం గడుస్తున్న పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఎంపీడీఓ ప్రత్యేక శ్రద్ధ వహించి పరిసర ప్రజలు ఆనారోగ్యానికి గురవ్వకుండా మరోసారి అధేశాలిచ్చి పందుల అవాసాలను తొలగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.ఎంపీడీఓ అధేశాలపై పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో పందుల అవాసాలేర్పాటు చేసిన యాజమానులకు రెండుమార్లు నోటిసీలు పంపించామని..మరోసారి నోటిస్ పంపించి చర్యలు చేపడుతామని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి నిర్లక్యం..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES