నవతెలంగాణ – వేములవాడ రూరల్: వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న బూర్ల నవీన్ (30) లివర్ వ్యాధితో గురువారం సాయంత్రం మృతి చెందాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నవీన్‌కు వైద్యులు కాలేయ వ్యాధి ఉందని నిర్ధారించడంతో, కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న నవీన్ మరణంతో గ్రామంలో శోకసంద్రం అలముకుంది. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్ మరణంతో ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నదని, ప్రభుత్వం ముందుకు వచ్చి తక్షణ సాయం అందించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
లివర్ వ్యాధితో పంచాయతీ కార్మికుడు మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    