Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజోలిలో పంచాయతి కార్మికులు అరెస్టు

రాజోలిలో పంచాయతి కార్మికులు అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ- రాజోలి
రాజోలి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రాజోలి గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా సిఐటియు ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ముట్టడించాలని కార్మికులకు పిలుపు ఇవ్వడం జరిగింది. కార్మికుల వేతనాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని కార్మికులకు రూ.21 వేల వేతన నివ్వాలని ప్రభుత్వ ఉద్యోగాలుగా సరి సమానంగా బెనిఫిట్స్ ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ కల్పించాలని తదితర అంశాలపై చలో అసెంబ్లీ పుట్టడి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే పోలీసులు పంచాయతీ కార్మికులని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని న్యాయమైన కార్మికుల సమస్యలు తీర్చేంతవరకు పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతుగా ఉంటుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి విజయకుమార్ అన్నారు. అరెస్ట్ అయిన వారిలో సీఐటీయూ నాయకులు లక్ష్మన్న కృష్ణ సౌలు రాజు ఉన్నారు. తర్వాత కార్మికులను ఇంటికి పంపించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -