నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలాల పరిధిలో మొత్తం 34 పంచాయితీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 34 పంచాయితీలకు కొత్త పాలకవర్గాలతో కళ రావడం 34 పంచాయతీల పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త సర్పంచులు ప్రత్యేక దృష్టి సాదిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల కాలంగా పంచాయితీ పాలకవర్గాలు లేకపోవడం ప్రత్యేక అధికారుల పాలన అంతంత మాత్రంగానే సాగింది. ఈ నేపథ్యంలో గ్రామాలలో కొత్త పాలక వర్గాలు కొలువు దీరడం ప్రజలకు భారీ ఊరటనిచ్చే అంశం. అదేవిధంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలపై నూతన సర్పంచ్ లు వెంటవెంటనే దృష్టి సారించి, సమస్యల కృషికి చర్యలు చేపడుతున్నారు.
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సాధిస్తూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కౌట్లు వేయించడం, నీటి ఎద్దడి గల వాడల్లో నీటి సమస్య తీర్చడానికి బోర్లు వేయించే పనిలో దృష్టి సాదించారు. ఇలాంటి ప్రజా సమస్యలపై నూతన కొత్త సర్పంచుల పాలకవర్గాలు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ప్రజా సమస్యలు వారి వారి దృష్టికి రావడం ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లోని ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సాదిస్తున్నారు. ఇరు మండలాల పరిధిలో కొత్త సర్పంచులు ఉప సర్పంచ్లు ఈ విధంగా ఉన్నారు.
మద్నూర్ మండలంలోని 21 గ్రామపంచాయతీలలో కొత్తగా ఎన్నికైన సర్పంచు ల వివరాలు ఇలా ఉన్నాయి.
అంతాపూర్ పార్వతిబాయి, అవల్గావ్ మాన్య బాయి, చిన్న ఎక్లార మాధవరావు, చిన్న తడగూర్ సూర్యవంశం ప్రకాష్, దన్నూర్ జయశ్రీ, గోజేగావ్ భారత్ రాథోడ్, హెచ్ కేలూర్ జి లక్ష్మణ్, కొడిచర తేజశ్రీ, లచ్చన్ సంజీవ్, మద్నూర్ ఉష మచ్కూర్ వార్, మేనూర్ అశోక్ జంశెట్టి వార్, పెద్ద ఎక్లారా మహేష్ సోమవార్, రాచూర్ లోకండే ఆకాష్, రూసే గావ్ భూతాలే సుమన్బాయి, పెద్ద షక్కర్గా విశాలాక్షి, చిన్న షక్కర్గా దిగంబర్, షేక్కాపూర్ తుకారం ఇబిత్వార్, సోమూర్ హనుమంతు వార్ సంగ్రామ్, సుల్తాన్ పేట్ రాజేశ్వర్ గౌడ్, పెద్ద తడగూర్ శాంతాబాయి, తడి ఇప్పర్గా అశ్విని,
డోంగ్లి మండల కొత్త సర్పంచుల వివరాలు ఇలా ఉన్నాయి,
డోంగ్లి రేఖ, ధోతి తోపారే సంగ్రామ్, ఇలేగావ్ కైష్కా షాన్ షేక్, ఏనాబోరా షేక్యూనుస్, హాసన్ టాక్లి నక్కే వార్ దత్తు, కుర్లా డబ్బుడే శోభ, లింబూర్ సుజాత, మాదన్ఇప్పరుగా బాచావార్ లక్ష్మణ్, మల్లాపూర్ అమృత్వార్ శ్రీకాంత్, మారేపల్లి శ్రీధర్ గైక్వాడ్, మోగా బస్వంత్ ఆలే, సిర్పూర్ గజానంద్ పటేల్, పెద్ద టాక్లి అంజన్బాయి.



