- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ గ్రామంలోని గిరిజన బాలుర వసతి గృహ వార్డెన్ శాంతి ఆధ్వర్యంలో 79వ పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జాతీయ జెండాను వార్డెన్ ఎగురవేశారు. ఈ సందర్భంగా కొన్ని సంస్కృతిక కార్యక్రమాలు హాస్టల్ ఆవరణలో నిర్వహించి విద్యార్థిలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటల పాటలతో గడపడం జరిగింది. అనంతరం వసతి గృహ విద్యార్థులకు మిఠాయిలు పంపించేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక వంటకాలు చేసి విద్యార్థులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎస్టి హాస్టల్ వార్డెన్ సిబ్బంది, వసతి గృహ విద్యార్థులు , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -