సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘పంజరం’. సాయికృష్ణ దర్శకత్వంలో ఆర్ రఘన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో నటించారు. కొత్త వాళ్లంతా కలిసి చేసిన ఈ హర్రర్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ,’నాకు ఈ ప్రయాణంలో సహకరించిన టీంకు థ్యాంక్స్. మోహన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఆర్‌ఆర్, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరూ పెద్ద స్టార్స్ అవుతారు. ప్రదీప్ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించారు. పద్మ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రమణ, సురేష్, ప్రదీప్..ఇలా అందరూ బాగా నటించారు.
నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అనిల్, యువతేజ, ముస్కాన్, రూపలకు థ్యాంక్స్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ చిత్రంలో నేను మల్లి అనే పాత్ర పోషించాను. నా కారెక్టర్, లుక్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. మా దర్శకుడు సాయి ఈ మూవీని గొప్పగా తీశారు. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని హీరో యువతేజ అన్నారు. మరో హీరో అనిల్ మాట్లాడుతూ, ”పంజరం’ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇందులో నేను కార్తిక్ అనే పాత్రలో నటించాను’ అని తెలిపారు. హీరోయిన్లు రూప, ముస్కాన్, మ్యూజిక్ డైరెక్టర్ నాని మోహన్, నటి పద్మ, నటుడు రమణ నటుడు ప్రదీప్ ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ప్రేక్షకుల్ని భయపెట్టే ‘పంజరం’
- Advertisement -
- Advertisement -