Wednesday, June 11, 2025
E-PAPER
Homeఆటలుపంత్ భారీ షాట్‌ కు ప‌గిలిన‌ స్టేడియం రూఫ్

పంత్ భారీ షాట్‌ కు ప‌గిలిన‌ స్టేడియం రూఫ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ తనదైన రీతిలో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు లండన్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ కొట్టిన ఓ భారీ సిక్సర్ ఏకంగా ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియం పైకప్పును ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే… భారత జట్టు ఓపెన్ నెట్స్ సెషన్‌లో భాగంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో తనదైన‌శైలిలో దూకుడుగా ఆడుతూ ఒక బంతిని మోకాలిపై కూర్చొని లెగ్ సైడ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ బంతి గాల్లోకి లేచి స్టేడియం పైకప్పుకు బలంగా తగిలి, పైకప్పు కొంత భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ దృశ్యాన్ని చూసిన తోటి ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది సైతం పంత్ పవర్ హిట్టింగ్‌కు అబ్బురపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -