Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పాపన్న గౌడ్ చరిత్రను స్పూర్తిగా తీసుకోవాలి..

పాపన్న గౌడ్ చరిత్రను స్పూర్తిగా తీసుకోవాలి..

- Advertisement -

జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య అన్నారు. మండలంలోమీ కొయ్యుర్ సెంటర్ లో పాపన్న జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బహుజన రాజ్యం కోసం నిజం పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భూస్వాములతో కొట్లాడిన గొప్ప పోరాట యోధుడు సర్వాయి పాపన్నని కొనియాడారు. మోగులాయిలను ఎదిరించిన మొట్ట మొదటి తెలంగాణ రాజు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని పేర్కొన్నారు. 33 రాజ్యాలను స్థాపించిన బడుగుల ఆశాజ్యోతి ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవి భూమయ్య, కలిమోద్దీన్,గడ్డం ముత్తయ్య,కొమురయ్య పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad