Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్స్తంభించిన జనజీవనం

స్తంభించిన జనజీవనం

- Advertisement -

– ఉమ్మడి కరీంనగర్‌లో వాన బీభత్సం
– నర్మాల ప్రాజెక్టు వద్ద రెస్క్యూ ఆపరేషన్‌
– ముఖ్యమంత్రి పర్యటన, నేతల సమీక్ష
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. వరద బీభత్సం నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్మాల ప్రాజెక్టు వద్ద వరదలో చిక్కుకున్న ఏడుగురు పశువుల కాపర్లను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో రక్షించాయి. ఈ క్లిష్ట పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద పర్యటించారు. ఇతర నేతలు తమ ప్రాంతాల్లో కలియతిగిరారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పలు ఘటనలు అవాస్తవాలంటూ అధికారులు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్మాల ప్రాజెక్టు వద్ద ఎగువ మానేరు వరదలో చిక్కుకున్న ఏడుగురు పశువుల కాపర్లను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం అసాధారణ కృషి చేశాయి. బుధవారం సాయంత్రం వరదలో చిక్కుకున్న వీరికి రాత్రి డ్రోన్‌ల ద్వారా ఆహారాన్ని అందించారు. గురువారం ఉదయం హకీంపేట నుంచి రప్పించిన హెలికాప్టర్‌ల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌ను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కేంద్ర మంత్రి బండి సంజరు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, స్థానిక నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు. సమర్థవంతమైన సహాయక చర్యలు చేపట్టిన కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, ఎస్పీ మహేష్‌ బి గీతేను కేంద్ర మంత్రి అభినందించారు.

జలకళతో ప్రాజెక్టులు.. రికార్డు స్థాయిలో వరద
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఈ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో 8 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తుండగా, అదే స్థాయిలో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మధ్య మానేరు, దిగువ మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. గేట్లు ఎత్తి వరదను క్రమబద్ధీకరిస్తున్నారు. ముఖ్యంగా ఎగువ మానేరు ప్రాజెక్టు ఇప్పటికే నిండి అలుగు పారుతోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad