Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపారామెడికల్‌ పోస్టులను భర్తీ చేయాలి

పారామెడికల్‌ పోస్టులను భర్తీ చేయాలి

- Advertisement -

ప్రజా భవన్‌లో ఆందోళన
ప్రాసెస్‌ ప్రారంభించిన ప్రభుత్వం : తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పారామెడికల్‌ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆ సంఘం ప్రతినిధి బృందం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌ డిమాండ్‌ చేశారు. దీంతో చిన్నారెడ్డి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. సోమవారం ( 22న) నర్సింగ్‌ ఆఫీసర్లకు సంబంధించిన మెరిట్‌ లిస్టు ఇస్తామని తెలిపారు. రెండు రోజులు అభ్యంతరాలు తీసుకున్న తర్వాత మళ్లీ నాలుగైదు రోజుల్లో ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ ఇచ్చి వెరిఫికేషన్‌ పెడతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం నర్సింగ్‌ ఆఫీసర్ల మెరిట్‌ లిస్టు వెంటనే ఇవ్వాలని కోరారు. ఫార్మాసిస్టు పోస్టులకు సంబంధించిన విషయమై ఫార్మసిస్టుకు అప్లై చేసుకున్న అభ్యర్థుల ఆధ్వర్యంలో చిన్నారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దీంతో సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఫార్మసిస్టుల సమస్యలపై డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ అధికారులు పంపిన నివేదిక ఆధారంగా రిపోర్టు తయారుచేసి మంత్రికి పంపినట్టు తెలిపారు. మంత్రి నుంచి వవచ్చిన తర్వాత వాళ్ళ రిక్రూట్‌మెంట్‌ కూడా ప్రాసెస్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ల్యాబ్‌ టెక్నీషియన్లకు సంబంధించిన రిక్రూట్‌మెంట్‌లో వెబ్‌ కౌన్సిల్‌ స్టేజిలో ఆగిపోయిన దశలో వారు కూడా పెద్ద సంఖ్యలో శుక్రవారం ప్రజాభవన్‌కు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -