Monday, November 10, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పార్డి (బి) ఉన్నత పాఠశాల విద్యార్థులు వ్యారచన పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపిక 

పార్డి (బి) ఉన్నత పాఠశాల విద్యార్థులు వ్యారచన పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని పార్డి (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తెలంగాణ స్కిల్ అకాడమిక్ టాలెంట్ వారి ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని జుమ్మెరథ పేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మండల స్థాయిలో వ్యాసరచన పోటీలు, టాలెంట్, తదితర పోటీలు నిర్వహించి జిల్లా కేంద్రంలో మండలం నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. దింతో జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రథమ స్థాయిలో నిల్చిన పార్డి (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్ధి కార్తీక్ జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న విద్యార్ధికి మొమంటో ప్రశాంసా పత్రం అందజేశారు. దింతో జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్ధి 13న నిర్వహించే రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘం అధ్యక్షులు మహేందర్ ప్రధాన కార్యదర్శి సదానందం,ప్రధానోపాధ్యాయులు నారాయణ్ రెడ్డి,దశరథ,విజయ్ కుమార్ వెంకటేశ్వరు విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -