Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, క్రమశిక్షణ, భవిష్యత్ లక్ష్యాలపై అధ్యాపకులు తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చించారు. విద్యార్థులహాజరు శాతం వాటిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణను కూడా అందిస్తున్నాయని, తల్లిదండ్రుల సహకారం ఉంటే విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా వారి ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.

అనంతరం వివిధ రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు శ్రావణ్ కుమార్ తెలంగాణ హైకోర్టు న్యాయవాది.  మేఘరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల దోమకొండలో హిస్టరీ లెక్చరర్ , ఎస్ జి టి ఉద్యోగం సాధించిన సృజన తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు లక్ష్యంతో కష్టపడితే విజయం సాధించవచ్చని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం చివరలో తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించగా, ప్రిన్సిపాల్ , అధ్యాపకులు వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కళాశాలకు వచ్చిన డిజిటల్ బోర్డు పరికరాలు ఫిజిక్స్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ల్యాబ్ లను తల్లిదండ్రులకు చూయించారు.ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రాజగోపాల్ లక్ష్మణ్ శ్రీధర్ జెట్టి విజయకుమార్ రమేష్ వెంకటస్వామి సరిత సుజాత స్వప్న సాంబాజి మమత తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -