Sunday, June 22, 2025
E-PAPER
Homeకవితతల్లిదండ్రుల గుండె ఘోష

తల్లిదండ్రుల గుండె ఘోష

- Advertisement -

కాన్వెంటోని మీద మన్ను బడా
వాడు గుంజెటి ఫీజుల్‌ పై బండ బడా
జూను వచ్చిందమ్మ ఝల్లుల్‌ బడా
పేరెంట్ల జేబులు చిల్లుల్‌ బడా
జూను వచ్చిందమ్మ ఝల్లుల్‌ బడా
పేరెంట్ల జేబులు చిల్లుల్‌ బడా

బళ్ళు తెరిచిరమ్మ చదువుల్‌ మొదలుబడ
పెరిగిన క్లాసుల్ల పోరల్‌ మురిసిపడ
కొత్త బుక్కు డ్రస్సుల్ల పిల్లల్‌ కలకల్లాడ
పైసలై పోయి, మా మొఖాలేలాడా

నల్లాని మొగుళ్ళు నిండా తెచ్చెనీళ్ళు
జూన్‌ గుండె గుబులు మిగిల్చె కన్నీళ్ళు
ఏరువాకా సాగే రైతు తుళ్ళి పడా
ఎటియం వాపసొచ్చె నాయన ఉలికి పడా

సర్కారి బడి పంతుల్‌ సల్లంగా ఉండాలి
చెప్పేటి సదువూలు సక్కంగా ఉండాలి
సదువుల్‌ మంచిగుంటే ఎంత బాగుండూ
ప్రవేటు తంటాలే లేనే లేకుండూ

నిండు కుండలైనై వాగుల్లు వంకల్లు
గుండుసున్నాలైనై అకౌంటు బుక్కుల్లు
చారు పులుసు తిని అప్పు తీర్చుకుంటం
యునిఫాంల పోరల్జూసి ముర్సిపొతుంటం
చారు పులుసు తిని అప్పు తీర్చుకుంటం
యునిఫాంల పోరల్జూసి ముర్సిపొతుంటం
– షేక్‌ అబ్దుల్‌ సమద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -