Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువతను సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి 

యువతను సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  : యువతను సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ శనివారం అన్నారు.  సమాజంలో యువత గంజాయికి బానిసలై చెడు మార్గం పట్టకుండ పోలీసుల కన్నా యువతను సక్రమార్గంలో నడిపించే పూర్తి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, గంజాయి మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి  తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ వారి బృందం ఆధ్వర్యంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న,తెలంగాణ ప్రజానాట్యమండలి బస్సు కళాజాత  అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు హైదరాబాదు నుండి అదిలాబాద్ వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి బస్సు కళాజాత పట్టణం లోని పెర్కిట్ కు చేరుకుంది. ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు అన్న నిదానంతో  పెరికిట్ బస్టాండ్ చౌరస్తాలో ఆటపాటలతో  ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పల్లె నరసింహ మాట్లాడుతూ యువత డ్రగ్స్ గంజాయి బారినపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారా, యువత చెడు మార్గం వీడి సక్రమార్గంలో నడవాలని, ఈ కార్యక్రమం ద్వారా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్  మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి యువతను గంజాయికి బానిసలను చేస్తున్నారని అన్నారు. యువత గంజాయికి బానిసలై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో యువత చెడు మార్గం వీడి  మంచి భవిష్యత్తుకు బాట వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జననాట్యమండలి ప్రతినిధులు, బట్టు శ్రీధర్, నారాయణ, లక్ష్మీనారాయణ, ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు కుండ రాంప్రసాద్, కొండి రామచంద్ర, నూకల శేఖర్, ఇట్టెం రాంప్రసాద్, మాజీదు ఎంటర్ప్రైజెస్ ఇంతియాజ్, నవీన్, టైలర్ వినోద్, భవాని శ్రావణ్, రాజేశ్వర్ గౌడ్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -