Friday, January 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ మార్పు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ మార్పు

- Advertisement -

ఒకటి నుంచి పదో ప్లాట్‌ఫాంకు తరలింపు
దక్షిణ మధ్య రైల్వే అధికారుల వెల్లడి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌ ప్రాంతాన్ని మార్చినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాట్‌ఫాం నెంబర్‌ వన్‌ వద్ద ఉన్న పార్కింగ్‌ను రద్దు చేసి ప్లాట్‌ ఫ్లాం 10 వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ఏరియాలో స్వల్ప కాల రాకపోకలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఈ జోన్‌లో ప్రవేశించే ప్రయాణీకులు 15 నిమిషాల వరకు ఉచిత పికప్‌, డ్రాప్‌ సౌకర్యం కల్పించినట్టు పేర్కొన్నారు. స్టేషన్‌ పునరుద్దరణ పనుల నేపథ్యంలో జరుగుతున్న అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -