Tuesday, September 23, 2025
E-PAPER
Homeజాతీయంఇవాళ్టి నుంచి పార్లమెంటు సమావేశాలు..

ఇవాళ్టి నుంచి పార్లమెంటు సమావేశాలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 21 రోజుల పాటు ఈ పార్లమెంట్ సెషన్ జరగనుంది. జూలై 21 అంటే ఇవాల్టి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు 8 కొత్త బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది కేంద్ర సర్కారు. మొత్తం 21 సెషన్లు ఈసారి జరగబోతున్న నేపథ్యంలో… ఆగస్టు 12వ తేదీ నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు పార్లమెంటుకు సెలవులు ఉండనున్నాయి. ఆ సమయంలో రక్షాబంధన్, స్వాతంత్ర దినోత్సవం పండుగలు వస్తున్నాయి. అందుకే ఆగస్టు 12 నుంచి 18వ తేదీ వరకు.. పార్లమెంట్ సమావేశాలకు బ్రేక్ ఉండనుంది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్, బీహార్ ఓటర్ లిస్టు సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా… మహిళలపై దాడులు, అలాగే దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య లాంటి ఇష్యులపై కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విపక్షాలు నిలదీయబోతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -