Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంస్తంభించిన పార్లమెంట్‌

స్తంభించిన పార్లమెంట్‌

- Advertisement -

ఎస్‌ఐఆర్‌పై చర్చకు ప్రతిపక్షం పట్టు
మాజీ సీఎం శిబూ సోరెన్‌కు
పార్లమెంట్‌ ఉభయ సభలు ఘన నివాళి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీంతో పార్లమెంట్‌ స్తంభించింది. లోక్‌సభ ప్రారంభం కాగానే ఎస్‌ఐఆర్‌పై చర్చకు డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్లకార్డు పట్టుకుని నినాదాల హౌరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం పార్లమెంట్‌ ఆవరణంలో కాంగ్రెస్‌ ఎపీి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌పై పార్లమెంట్‌లో చర్చించాలనే ప్రతిపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించాలని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ అణగారిన వర్గాలను అసమానంగా ప్రభావితం చేసిందని, త్వరలో అసోం, పశ్చిమ బెంగాల్‌ వంటి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని అన్నారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌తో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధత పరిణామాలపై సమగ్రమైన, పారదర్శక మైన చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. దేశంలో రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును ఖూనీ చేస్తోందని, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. నిమిషాల్లో సభ వాయిదా పడింది.
మాజీ సీఎం శిబూ సోరెన్‌కు పార్లమెంట్‌ ఉభయ సభలు ఘన నివాళి
అంతకుముందు జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం వ్యవస్థాపకులు శిబూ సోరెన్‌కు పార్లమెంట్‌ ఉభయ సభలు ఘనంగా నివాళులర్పించాయి. సభ్యులంతా మౌనం పాటించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతరం రాజ్యసభ ఆయన గౌరవార్థం సభను మంగళవారానికి వాయిదా వేశారు. గిరిజన ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం పోరాటంలో శిబూ సోరెన్‌ది ప్రముఖ స్వరమని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ అన్నారు. దిషోం గురుగా, ప్రజలలో గురూజీగా ముద్రను వేసుకున్న ప్రత్యేకమైన ఆదివాసీ నాయకుడని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా మాట్లాడుతూ గిరిజన వర్గాలను, తన సొంత రాష్ట్రాన్ని అభివద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad