సింగరేణికి సీబీఎల్ కంపెనీ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బ్రెజిల్ లిథియం మైనింగ్‌లో భాగస్వామ్యం కావాలని సింగరేణి సంస్థను ఆ దేశానికి చెందిన సీబీఎల్ కంపెనీ ఆహ్వానించింది. బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీబీఎల్ సంస్థ ప్రతినిధులు సింగరేణి సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్రెజిల్‌లో లిథియం మైనింగ్‌లో అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు. బ్రెజిల్‌లో ఇప్పటికే తాము లిథియం మైనింగ్ చేపట్టామనీ, సింగరేణి సంస్థ కీలక ఖనిజాల పట్ల ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తమ కంపెనీలో భాగస్వామిగా చేరితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వారు వివరించారు. ఈ భేటీలో సీబీఎల్ బోర్డు డైరెక్టర్ డేనియల్ లెమే, సీఈవో వినీసియస్ అల్వారెంగా, సింగరేణి డైరెక్టర్లు కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రెజిల్ లిథియం మైనింగ్‌లో భాగస్వామ్యం కండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



