Wednesday, February 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపార్టీ ఫిరాయింపు కేసు.. జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్

పార్టీ ఫిరాయింపు కేసు.. జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లుగా పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా స్పీకర్ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సంజయ్ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు.

పార్టీ ఫిరాయింపు కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై ఎమ్మెల్యే సంజయ్ స్పందింస్తూ.. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని, ఇప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తాను అందుకుంటున్న జీతంలో రూ.5 వేలు బీఆర్ఎస్ పార్టీకే వెళ్తున్నాయన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేగానే మద్దతు ఇస్తానన్నారు. ఇదిలా ఉండగా.. నేడు కడియం శ్రీహరిని స్పీకర్ విచారించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -