Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఫామ్‌హౌజ్‌లో పార్టీ.. పట్టుబడిన ఆఫ్రికన్లు

ఫామ్‌హౌజ్‌లో పార్టీ.. పట్టుబడిన ఆఫ్రికన్లు

- Advertisement -

– బాకారంలో ఎస్‌ఓటీ పోలీసుల దాడులు
– 51 మందిని అదుపులోకి తీసుకుని విచారణ
– మొయినాబాద్‌ పీఎస్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-మొయినాబాద్‌

ఫామ్‌హౌజ్‌లో విదేశీ మందు వినియోగం.. డిజే సౌండ్‌, నృత్యాలతో సందడి చేసిన 51 మంది ఆఫ్రికన్‌ దేశస్థులను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినానాబాద్‌ మండలం బాకారం సమీపంలోని ఎస్కేఎం ఫామ్‌హౌజ్‌లో జరిగింది. మొయినాబాద్‌ సీఐ పవన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫ్రికన్‌ దేశానికి చెందిన పలువురు ఫామ్‌హౌజ్‌లో పుట్టిన రోజు వేడుకలు ఏర్పాటు చేశారు. ఫామ్‌హౌస్‌లో చాలా కార్లు ఉండటం, డీజే సౌండ్స్‌ రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఓటీ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో శుక్రవారం ఉదయం ఫామ్‌హౌజ్‌పై దాడి చేశారు. ఆఫ్రికన్‌ దేశానికి చెందిన 51 మందిని గుర్తించారు. ఇందులో 37 మంది మహిళలు, 14 మంది పురుషులున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలంలో విదేశీ మందు బాటిళ్లతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వీసాలను పోలీసులు పరిశీలించారు. పార్టీ నిర్వహించుకునేందుకు పర్మిషన్‌ ఉందా లేదా విదేశీ మద్యం ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంపై విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad