– కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు గుగులోతు భారతీ దేవేందర్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలో నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన పార్వతమ్మ గూడెం సర్పంచ్ ఏదేళ్ల పూలమ్మ మరియు వస్త్రం తండా గ్రామపంచాయతీ సర్పంచ్ కరుణా మధు ల ను శాలువాతో ఘనంగా సత్కరించినట్లు కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు గుగులోతు భారతీ దేవేందర్ తెలిపారు ఆదివారం వారి నివాసులలో శాలువతో ఘనంగా సత్కరించి భూకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడపగడపకు చేరే విధంగా కృషి చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు రుణపడి ఉంటామని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల సమస్యపై నిరంతరం మీరు శ్రమిస్తున్నందుకు కృతజ్ఞతలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూక్య జగన గుగులోతు వెంకన్న ఇస్లావత్ బీసు భూక్య వీరన్న రామచందర్ భూక్య శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
పార్వతమ్మ గూడెం వస్త్రం తండా గ్రామ సర్పంచ్ లకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



