Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీ కెమెరాలను ప్రారంభించిన పసర ఎస్ఐ

సీసీ కెమెరాలను ప్రారంభించిన పసర ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
పసర పోలీస్ స్టేషన్ ఎస్ ఐ కమలాకర్ సూచన మేరకు, గ్రామంలో ప్రముఖ వ్యాపారులు శ్రీనివాస్  బాలాజీ ఫర్టిలైజర్స్ , రమణ వంశీ ఫర్టిలైజర్స్ షాపు  లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎస్ఐ కమలాకర్ ప్రారంభించి మాట్లాడారు. మండలంలో నేర నియంత్రణ కొరకు వ్యాపారస్తులు కెమెరాలు పెట్టుకోవాలని, సమావేశంలో తెలిపిన ప్రకారం, మొట్టమొదటగా   వారి షాపు పరిసరాలు కనిపించేలా కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, తెలిపారు. ఈ కెమెరాలు దొంగతనాలు అరికట్టడంలో  కీలక పాత్ర పోషిస్తాయని, అనుమానిత వ్యక్తుల కదలికలపై , నిఘా నేత్రాలు , పోలీసులకు సహకరిస్తాయని తెలిపారు. చల్వాయి గ్రామంలో  వ్యాపారస్తులందరూ  తప్పకుండా తమ షాపుల ముందు  సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ కెమెరాల ఏర్పాటుకు  ప్రజలు వ్యాపారస్తులు యువత  సహకరించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -