సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి. యాదయ్య
ఇ.పట్నం డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
ఈ నెల 26న జరుగనున్న అమరులు పాషా, నరహరి 36వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి యాదయ్య పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే ఈ వర్ధంతి సభకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్టు మండలాల కార్యదర్శులు, మున్సిపల్ పరిధిలోని పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రతిఘటించాలన్నారు.
దున్నే వానికి భూమి కావాలని నిర్వహించిన తెలంగాణ రైతాంగ సైత పోరాటాన్ని కొనసాగిస్తూ నిర్వహించిన అనేక పోరాటాలకు పాషా నరహరి నాయకత్వం వహించి విజయం సాధించారన్నారు. రైతాంగానికి భరోసా కల్పించారన్నారు. ఎడ్ల బండ్లు కొట్టి జీవనం సాగిస్తున్న రైతులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఎదిరించారన్నారు. మరోవైపు ఎంపీపీగా నరహరి నాయకత్వంలో మంచాల మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారన్నారు. ఇదే తరుణంలో రోజురోజుకు గ్రామాల్లో పార్టీ బలోపేతం అవుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ మూకలు అతికిరాతకంగా హత్య చేశారన్నారు. ఈ నెల 26 రోజుకు 36సంవత్సరాలు పూర్తి కావస్తున్న వారి ఆదాయాలను ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పేదలు, శ్రామికుల, కార్మికుల, రైతుల పక్షాన విద్యార్థుల, యువకుల పక్షాన భూస్వాములకు ఆగడాలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు నిర్వహించారన్నారు. పేదలకు భూమిలేని పేదలకు భూములు పంచారన్నారు. ఈ పోరాటాలను ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ, భూస్వాములు, మతోన్మాద ఆర్ఆర్ఎస్ గుండాలు అతి కిరాతకంగా పాషా, నరహరిని చంపి ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాలు లేకుండా చేయాలని కుట్ర పన్నారన్నారు. ఈ తరుణంలో నిర్వహిస్తున్న పాషా , నరహరి 36 వర్ధంతిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. సామెలు, డి. రాంచందర్, ఇ. నర్సింహా, జిల్లా కమిటీ సభ్యులు రావుల జంగయ్య, బుగ్గరాములు, సిహెచ్. ఏలేష, ఆలేటి, ఎల్లయ్య, జి. గణేష్, విజయ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పాషా నరహరి 36వ వర్ధంతిని జయప్రదం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



