నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలో ఫ్రెండ్లీ పోలీసులు పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ ఉత్తమంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా అందులోనూ అత్యుత్తమ సేవలు కనబరిచిన ఎస్ హెచ్ ఓ ల కొరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజల అభిప్రాయ సేకరణ చేయగా రాష్ట్రంలోనే టాప్ 10 పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లలో ములుగు జిల్లా నుండి పస్ర ఎస్సై కమలాకర్ ఒకరిగా నిలవడం అభినందనీయం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలతో మమేకమౌతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థకు మారుపేరులా నిలిచిన పస్ర ఎస్సై కమలాకర్ తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం జరిగింది. ఇట్టి విషయమై జిల్లా ఉన్నతాధికారులు తోటి అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు పస్ర ఎస్సై కమలాకర్ కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పస్ర ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ తనకు ఎల్లవేళలా అండగా ఉన్న ఉన్నతాధికారులకు తనకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ లో పస్ర పోలీస్ ఎస్ ఐ ఏ కమలాకర్ ఉత్తమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES