సైన్స్ తోటే సర్వతో ముఖాభివృద్ధి సాధ్యం
జెవివి నెల్లికుదురు మండల కమిటీ అధ్యక్షుడు దేశెట్టి యాకన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
జన విజ్ఞాన వేదిక నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 7వ తారీకున పాఠశాల స్థాయి స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు దేశెట్టి యాకన్న తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చెకుముకి టాలెంట్ టెస్ట్ ద్వారా పిల్లలు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకుంటారు అని , విద్యార్థిని విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని సృజనాత్మకతను వెలికి తీయడానికి చెకుముకి టాలెంట్ టెస్ట్ దోహదపడుతుంది అన్నారు. ప్రజలకు మూఢనమ్మకం పట్ల , డ్రగ్స్ నిషేధం పట్ల , సైన్స్ సెమినార్ లా ద్వారా అందరినీ చైతన్య వంతం చేయడంలో జన విజ్ఞాన వేదిక ఎనలేని కృషి చేస్తుంది అని అన్నారు. మండల స్థాయి పోటీలలో మండల పరిధిలోగల అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు పాల్గొంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆరిగకూటి శ్రీనివాసరెడ్డి, జె వి వి మండల కమిటీ… మర్సకట్ల అనిల్ కుమార్, కందికొండ బాబు, సతీష్, ప్రకాష్ బాబు, బండి శ్రీనివాస్, రామ్మూర్తి, సుధాకర్, శ్రీనివాస్, కవిరాజు, సుభాష్, వెంకటేశ్వర్లు , ప్రదీప్ కుమార్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
చెకుముకి టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



