Monday, January 19, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేట బస్ స్టాండ్ లో పోటెత్తిన ప్రయాణీకులు

అశ్వారావుపేట బస్ స్టాండ్ లో పోటెత్తిన ప్రయాణీకులు

- Advertisement -

– పల్లెలకు బస్ సర్వీస్, ఉచిత ప్రయాణం ప్రభావం
నవతెలంగాణ – అశ్వారావుపేట

మూడు రోజుల పర్వదినం సంక్రాంతి ముగియడంతో సోమవారం అశ్వారావుపేట బస్ స్టాండ్ లో ప్రయాణీకులు పోటెత్తారు. ఇటీవల కాలంతో ఇంత కిక్కిరిసిన ప్రయాణీకులతో స్థానిక బస్ స్టాండ్ కనిపించడం ఇదే మొదటి సారి లా అనిపిస్తుంది.

భద్రాచలం నుండి ఆంధ్రా రాజమండ్రి,కాకినాడ,విశాఖపట్టణం,ఈ ప్రాంతాలు నుండి భద్రాచలం వచ్చి పోయే సుమారు 19  బస్సులు అన్నీ అశ్వారావుపేట బస్ స్టాండ్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

అలాగే నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట నుండి వినాయక పురం మీదుగా ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, వెలేరుపాడుకు, రామన్నగూడెం మీదుగా ఆంధ్రా రామన్నగూడెం, పూచికపాడు మీదుగా తెలంగాణ, అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల వరకు రెండు బస్ సర్వీస్ లు ఉండటం, ఉచిత ప్రయాణం కావడంతో ప్రజా రవాణా మెరుగుపడి నట్లు బస్ స్టాండ్ రద్దీని బట్టి అర్ధం అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -