Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డుపై కల్లాలతో ప్రయాణికులకు ఇక్కట్లు.!

రోడ్డుపై కల్లాలతో ప్రయాణికులకు ఇక్కట్లు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రోడ్లపై ధాన్యం కల్లాలు ఏర్పాటు చేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్లను పూర్తిగా వరి ధాన్యంతో నింపేయడం, రాళ్లు అడ్డు పెట్టడం ద్వారా ప్రమాదాల బారిన పడుతున్నామని పలువురు వాహనదారులు వాపోయారు. పోలీసులు కల్పించుకుని రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. మండలంలో తాడిచెర్ల నుంచి పెద్దతూoడ్లకు వేళ్ళు ప్రధాన రోడ్డు,కొయ్యుర్ నుంచి రుద్రారం వేళ్ళు ప్రధాన రోడ్డు, నా చారం, ఆన్సాన్పల్లి, ఎడ్లపల్లి తదితర గ్రామాల్లో రోడ్లపై ధాన్యం అరబోయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -