Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి తుమ్మలతో పసుపుబోర్టు సెక్రెటరీ భేటీ

మంత్రి తుమ్మలతో పసుపుబోర్టు సెక్రెటరీ భేటీ

- Advertisement -

నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పసుపు బోర్డు సెక్రటరీ ఎన్‌.భవానీశ్రీ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం సాగులో ఉన్న పసుపు రకాలకు బదులుగా అధికంగా కుర్క్‌మిన్‌ ఉన్న రకాలను సాగు చేయించాలని సూచించారు. ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. అనంతరం భవానీ శ్రీ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన పసుపుబోర్డు గత ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కోతల అనంతరం ఉపయోగపడే పసుపు ఉడకబెట్టే యంత్రాలను, పాలిషర్స్‌, గ్రైండర్లు లాంటి వాటిని రైతులకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. పసుపు ఉత్పత్తులకు ఫార్మా, ఆయుర్వేద రంగాల్లో ఉన్న అవకాశాలు పరిశీలించి, బోర్డు ద్వారా మార్కెటింగ్‌ లింకేజీలు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -