Tuesday, December 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'పతంగ్‌'.. ఓ కొత్త రకమైన సినిమా

‘పతంగ్‌’.. ఓ కొత్త రకమైన సినిమా

- Advertisement -

సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’. పతంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రమిది. సినిమాటిక్‌ ఎలిమెంట్స్‌, రిషన్‌ సినిమాస్‌, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ శేఖర్‌ అన్నే, సంపత్‌ మకా, సురేష్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్‌ ప్రణవ్‌ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్‌ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, సింగర్‌, నటుడు ఎస్‌పీ చరణ్‌ కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ ఎంతోఎనర్జిటిక్‌, ఎంటర్‌ టైనింగ్‌గా అనిపించింది. ట్రైలర్‌ చూడగానే సూపర్‌ థ్రిల్ల్‌గా ఫీలయ్యాను. ఓ సూపర్‌హిట్‌ సినిమాకు. బ్లాక్‌బస్టర్‌ సినిమాకు కావాల్సిన ఆల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. యూత్‌కు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఫ్రెండ్‌ షిప్‌ ఉంది. లవ్‌ ఉంది. గ్రేట్‌ మ్యూజికల్‌ ఎనర్జీ ఉంది. ఈ సినిమా తప్పకుండా థియేటర్‌లో ఆడియన్స్‌ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకు హిట్‌ కళ కనిపిస్తుంది’ అని తెలిపారు. ‘పతంగ్‌ల పోటీ అనేది అందరికి చిన్నప్పడి నుంచి మంచి అనుబంధం ఉంటుంది. ఈ సినిమా అందరికి కొత్త అనుభూతినిస్తుంది. రియలిస్టిక్‌ సినిమాటిక్‌ ఫీల్‌ను కలిగిస్తుంది’ సహ నిర్మాత రమ్య వేములపాటి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -