- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాలుస్తూ గాయపడిన వారంతా నగరంలోని సరోజిని ఆస్పత్రికి క్యూకడుతున్నారు. ప్రస్తుతం 70 మందికి పైగా బాధితులు చేరారు. ఇందులో 20 మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఆసుపత్రి సిబ్బంది వీరిలో ఇద్దరినీ ఇన్ పేషెంట్ గా చేర్చుకుంది. అవసరమైతే రేపు చికిత్స నిమిత్తం సర్జరీ చేసే అవకాశం ఉంటుందని డ్యూటీ డాక్టర్ తెలిపారు. బాణాసంచాలోని రసాయనాలతో కళ్లు పరోక్షంగా ప్రభావితం కావచ్చు. సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీళ్లు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి.
- Advertisement -