విధులను నిర్లక్ష్యం చేసిన వైద్యులను సహించేది లేదు
డాక్టర్ల సమావేశంలోఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి పై రోగులకు భరోసా కల్పించాలని, విధులను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులను సహించేది లేదు. ఇష్టం ఉంటే పని చేయండి..! లేదంటే వెళ్లిపొండి అని వైద్యులపై డాక్టర్ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆస్పత్రిలో ఓపి సక్రమంగా నిర్వహించడం లేదని వైద్యులు అందుబాటులో ఉండడం లేదని నా దృష్టికి వచ్చింది కచ్చితంగా ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండాలన్నారు. అదేవిధంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు నైట్ డ్యూటీ డాక్టర్ ఆస్పత్రిలో ఉండాలన్నారు.
(కాల్ డ్యూటీ) ఫోన్ చేసి పిలిపించే విధానం బంద్ చేయాలని ఆదేశించారు. 75 బెడ్లు అనుమతి ఉన్న ఆసుపత్రికి పదిమంది డాక్టర్లు, 42 మంది సిస్టర్లు, 36 మంది శానిటేషన్ సిబ్బంది, 8 మంది వార్డ్ బాయిలు,మొత్తం 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయినప్పటికీ రోగులకు సరైన సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండలేదని మండిపడ్డారు. ప్రస్తుతం 75 బెడ్లు నుంచి 108 బెడ్లు వరకు ఆసుపత్రి అప్ గ్రేడ్ అయిందని త్వరలోనే బ్లడ్ బ్యాంకు, ఐసియు సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రి గదులు, పరిసరాలు శానిటేషన్ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
వైద్యులు సమయపాలన పాటించలేదని తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరి డెంటెడ్ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు , వైద్య సిబ్బంది ఉన్నారు.



