నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో పల్లె దవాఖాన ని ఆకస్మిక తనిఖీ చేశారు. పల్లె దవాఖాన కి ప్రతి రోజు సిబ్బంది వస్తున్నారా అని ఎం ఎల్ ఎచ్ పి, సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. రోజుకి ఆసుపత్రి కి ఎంత మంది ప్రజలు వస్తున్నారని తెలుసుకున్నారు. గ్రామంలో ఏమైనా విష జ్వరాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ పల్లె దవాఖాన పరిధిలో గత నెలలో ఎన్ని డెలివరీ లు జరిగాయి, అవి ఎక్కడ అయ్యాయని అడిగి తెలుసుకున్నారు.
ఈ నెలలో ఎన్ని ఈ డి డి లు ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్ గా చెకప్ కి వస్తున్నారా, గర్భిణి స్త్రీ లతో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతుండాలి, ఇప్పటి నుండి నార్మల్ డెలివరీ కోసం వారిని ప్రోత్సహించలన్నారు. అనంతరం వడ పర్తి గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించిన కలెక్టర్. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరీ అయ్యాని, ఎన్ని నిర్మాణంలో ఉన్నాయని, వాటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయ అని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.