Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్పాతూరికి రాష్ట్ర కీర్తి కిరీటం

పాతూరికి రాష్ట్ర కీర్తి కిరీటం

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందుకున్నారు.  హైదరాబాద్ లో జరిగిన   పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ నిత్యానందరావు చేతుల మీదుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాతూరి మహేందర్ రెడ్డి కీర్తి పురస్కారం అందుకున్నారు.సిరిసిల్ల పట్టణములోని కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలలో ఆంగ్లం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి1996లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు.పని చేసిన ప్రతి పాఠశాలలో అంకితభావంతో పనిచేసి విద్యార్థుల సంఖ్యను పెంచారు. 

పాఠశాల  మౌళిక వసతుల పట్ల శ్రద్ధను చూపి విరాళాలు సేకరించి విద్యార్థులకు అన్ని వసతులను ఏర్పాటు చేసి పాఠశాలను  తీర్చిదిద్దారు. పాఠశాలకు  స్వయంగా ఆర్ధిక వనరులను అందించి  పిల్లలను ప్రోత్సహించి వారిలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపే ఉద్దేశంతో తన తండ్రి పేరు మీద పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్,సిల్వర్ మెడల్స్ అందించేవారు.విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించేవారు. బాల సభ,ఇంకుడు గుంతల నిర్మాణం , కిచెన్ గార్డెన్ సేంద్ర్రేయ ఎరువుల తయారీ, పాఠశాల సుందరీకరణ మొదలగు కార్యక్రమాలను పిల్లల చేత చేయించేవారు. తన బోధనా సబ్జెక్ట్ లో ప్రతి సంవత్సరం 100% పలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించి ప్రత్యేక తరగతులను తీసుకునేవారు.

పాఠశాలలో పిల్లలకు వినూత్న కార్యక్రమాలను పరిచయం చేస్తూ చదవడమే కాకుండా విద్యార్థులలో మానవతా విలువలను మంచి లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతోనిజాయితి దుకాణం  ,మానవత్వపు గోడ ,పెన్ బ్యాంకులను పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టి పిల్లలను ప్రోత్సహించేవారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పాఠశాలలో వాటిని ప్రవేశపెట్టి  ప్రత్యెక వెబ్సైటు, బల్క ఎస్ ఎం ఎస్ సిస్టం  నిర్వహణ మొదలగు కార్యక్రమాలను నిర్వహించేవారు.పాఠశాల కార్యక్రమాల్లో భాగంగా బడిబాట,హరిత హారం ప్రచార రథాలు , వన విజ్ఞానం,డిజిటల్ విద్యా భోధన మొదలగు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అమలు చేసారు.కరోనా సమయంలో ఖాళీగా కూర్చోక ఆన్లైన్ కోర్సులు రాసిరాష్టంలో అత్యదికంగా 1791 ప్రశంశా పత్రాలు అందుకుని రికార్డును సృష్టించారు.

ఉపాధ్యాయుడిగా 29 సంవత్సరాల ఆయన అకుంఠిత దీక్షకు అంకిత భావానికి గుర్తుగాజిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డ్, స్వచ్చ విద్యాలయ రాష్ట్ర అవార్డు,టూటర్స్ ప్రైడ్ ఐడియల్ టీచర్ రాష్ట అవార్డ్,రాష్ట్ర ఉత్తమ ఉపాద్యాయ అవార్డ్,అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు,నేషనల్ ఇంటిగ్రటేడ్ అవార్డ్, రాష్ట్ర గురుబ్రహ్మ అవార్డు, విద్యా బూషణ్ రాష్ర్ట అవార్డు, సేవారత్న రాష్ట్ర స్థాయి అవార్డ్, వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ గోల్డ్ మెడల్, సావిత్రిబాయి పులే విశిష్ట సేవా పురస్కారం, కరోనా వారియర్ రాష్ట్ర స్థాయి పురస్కారం, గ్లోబల్ టీచర్ అవార్డు, విశ్వగురు ఇంటర్నేషనల్ అవార్డు, ప్రైడ్ అఫ్ ఇండియా నంది అవార్డు, ఎక్సుక్లుసివ్ వరల్డ్ రికార్డు అవార్డు, విద్యారత్న జాతీయ పురస్కారం మొదలగు అనేక అవార్డులను ఆయన అందుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad