Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్న ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ తరుణంలో బీజీపీ కీలక ప్రకటన చేసింది. బీజేపీకి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారని, తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని ఆయన వెల్లడించారు. పవన్ మద్దతు తెలంగాణ బీజేపీకి తిరుగులేని బలాన్ని, వేగాన్ని ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -