Pawan Kalyan: గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతారా ? లేక అందులో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారా ? అన్నది తెలియడం లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం గతకంటే కాస్త భిన్నంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈసారి పొత్తుల విషయంలోనూ ఆచితూచి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
తాము పొత్తులు పెట్టుకోవద్దని చెప్పడానికి వైసీపీ ఎవరంటూ..పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు సాగుతామనే సంకేతాలను ఇచ్చారు. అయితే అనేక అంశాలపై క్లారిటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్.. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంపై మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతారా ? లేక అందులో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారా ? అన్నది తెలియడం లేదు.