- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
- Advertisement -