– సీఎస్‌కు ఎమ్మెల్యే విజయుడు వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని మన ఊరు-మనబడి కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావును ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. మన ఊరు-మనబడి బిల్లులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయనీ, దానివల్ల కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అసంపూర్తి పనులను పూర్తి చేయాలని సూచించారు. అలంపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి, పెండింగ్ బిల్లుల విడుదల, అసంపూర్తి పనుల పూర్తికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కురువ విజరు కుమార్, వెంకట్రాముడు, రాగవేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు-మనబడి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



