Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతులకు యూరియా గోస తీర్చండి: దుబ్బాక ఎమ్మెల్యే

రైతులకు యూరియా గోస తీర్చండి: దుబ్బాక ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఎంతో గొప్ప పడుతున్నారని ఒకవైపు సమృద్ధిగా వర్షాలు కురుస్తుంటే పంటలకు సరైన సమయంలో యూరియా వేసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రానికి 560 యూరియా బస్తాలు రాగా దాదాపు వెయ్యి మంది రైతులు వర్షానికి తడుస్తూ క్యూ లైన్ లో నిల్చున్నారు. ఈ విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సమయానికి ఎరువులను అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.పంటల సీజన్‌లో రైతులకు యూరియా అత్యవసరం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు రాత్రింబవళ్లు, వర్షానికి తడుస్తూ క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారన్నారు.రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి సరిపడా యూరియా తెప్పించాల్సింది పోయి, కేవలం ప్రకటనలకే పరిమితమైపోతోందని ఆయన మండిపడ్డారు.కెసిఆర్ పాలనలో రైతులకు ఏ కష్టం రాకుండా రెండు నెలల ముందుగానే యూరియా అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు. యూరియాతో రైతుల కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ఒకవైపు వర్షాలు పడుతూ చెరువులు, కుంటలు నిండి పొంగి,పొర్లుతు కొన్ని చెర్వులకు బుంగలు పడి పంట పొలాలు దెబ్బతింటుంటే మరోవైపు యూరియా దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం తక్షణ చర్యలు తీసుకోని రైతులకు సరిపడా యూరియా అందజేయాలని లేకుంటే రానున్న ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, మురళి, నాగులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad