- Advertisement -
నవతెలంగాణ – కుభీర్ : జీతాలు సకాలంలో ఇప్పించాలని కుభీర్ గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధువారం గ్రామపంచాయతీ కార్మికులు కుభీర్ ఎంపీడీఓ సాగర్ రెడ్డిని కలసి సమస్యలను తెలిపారు. గత మూడు నెలల నుంచి జీతాలు లేక నిత్యావసర సరుకులు కొనుగోళ్లు చేయడానికి డబ్బులు లేక, ఇబ్బందులు పడుతున్నామన్నారు. చాలి చాలని ఇచ్చే వేతనాల్లో కార్మికుల గైర్హాజరు పేరుతో వేధిస్తున్నారని మండల అధికారికి తమ గోడును వెల్లగక్కారు. ఇందుకు ఎంపీడీఓ సానుకూలంగా స్పందించి, రెండు రోజుల్లో కార్మికుల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మోహన్ సింగ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -