Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటి పన్నులు చెల్లించండి.. గిఫ్టు పట్టండి

ఇంటి పన్నులు చెల్లించండి.. గిఫ్టు పట్టండి

- Advertisement -

– బషీరాబాద్ సర్పంచ్ బైకాన్ జమున మహేష్ వినూత్న ఆలోచనా
– నెలరోజుల్లో ఇంటి పన్నులు చెల్లించిన 524 మంది
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామ సర్పంచ్ బైకాన్ జమున మహేష్ గ్రామంలో పేరుకుపోయిన ఇంటి పన్నుల వసూళ్లకు వినూత్న ఆలోచన చేశారు. ఈ మేరకు గత జనవరి 27న ఇంటి పన్నుల వసూళ్ల కోసం ప్రజలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా తీసుకున్నారు. నెల రోజుల్లో అనగా ఫిబ్రవరి 27 నాటికి ఇంటి పన్నులు చెల్లించిన లబ్ధిదారులను లక్కీ డ్రా చేసి, సొంత ఖర్చుతో గ్రైండర్, ఫ్యాన్, హెల్మెట్ బహుమతులుగా అందజేస్తామని ప్రకటించారు. సర్పంచ్ జమున మహేష్ నిర్ణయానికి గ్రామంలో మంచి స్పందన వచ్చింది.

నెల రోజుల్లో గ్రామంలో 524 మంది ఇంటి పన్నులు చెల్లించారు. చెప్పిన మాట ప్రకారం సర్పంచ్ జమున మహేష్ బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నెల రోజుల వ్యవధిలో ఇంటి పన్నులు చెల్లించిన లబ్ధిదారుల నుండి బహుమతుల కోసం లక్కీ డ్రా తీశారు. లక్కీ డ్రా లో సుంకేట పెద్ద ముత్తెన్నకు గ్రైండర్, సుంకేట చిన్న గంగారంకు ఫ్యాన్, బుక్కెన శోభకు హెల్మెట్ గెలుపొందారు.

లక్కీ డ్రా లో బహుమతులు గెలుపొందిన ఇంటి యజమానులకు సర్పంచ్ బైకాన్ జమున మహేష్, తహసిల్దార్ గుడిమేల ప్రసాద్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. వినూత్న ఆలోచనతో ఇంటి పన్నుల వసూలుకు కృషి చేస్తున్న సర్పంచ్ జమున మహేష్ ను తహసిల్దార్, మండల రెవెన్యూ అధికారి అభినందించారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శరత్, ఉపసర్పంచ్ చిలువేరి భూమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -