- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా పేటిఎం మీటింగ్ శనివారం నిర్వహించినట్లుగా పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పేటీఎం మీటింగ్, ఆహార పోషణ దినోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో తల్లిదండ్రులు రకరకాల వంటకాలు చేసి వాటిలో ఉన్నటువంటి ఆహార పోషక విలువలను, నాణ్యతపై వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి.కవిత, ఎం.కవిత, తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



