నవతెలంగాణ హైదరాబాద్: పాలసీబజార్ PoSP విభాగం పిబి పార్ట్‌నర్స్ ఇటీవల హైదరాబాద్‌లో తన మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. పిబి పార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకుడు ధ్రువ్ సరిన్, నేషనల్ సేల్స్ హెడ్ – హెల్త్ ఇన్సూరెన్స్ నీరజ్ అధాన, లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ – అసోసియేట్ డైరెక్టర్ రాహుల్ మహేష్ మిశ్రా, కమర్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ కోసం నేషనల్ సేల్స్ హెడ్ రోహితశ్వ మిశ్రా, మోటార్ ఇన్సూరెన్స్ కోసం నేషనల్ సేల్స్ హెడ్ అమిత్ భడోరియా వంటి కీలక వ్యాపార నాయకులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. PoSP ఏజెంట్ భాగస్వాములు, హైదరాబాద్ సేల్స్ బృందం, బీమా భాగస్వాములు వారితో కలిసి రిబ్బన్ కత్తిరించి, జ్యోతి వెలిగించి వేడుకగా, ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పిబి పార్ట్‌నర్స్‌కు భారతదేశం వ్యాప్తంగా దాదాపు 20 ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలు పిబి పార్ట్‌నర్స్ వ్యాపార బృందాలతో ఏజెంట్ భాగస్వాములు అర్థవంతమైన చర్చలను చేసుకునేందుకు ఒక వేదికను అందిస్తాయి. భారతదేశం వ్యాప్తంగా, ముఖ్యంగా వారి ప్రాంతాలలో బీమా కవరేజీని విస్తరించే వ్యూహాలపై దృష్టి సారిస్తాయి. తెలంగాణలో పిబి పార్ట్‌నర్స్ బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. దాదాపు 6,000 మంది ఏజెంట్ భాగస్వాములు ఉండగా, వారిలో 2,712 మందికి పైగా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారు.
నగరంలో మొదటి ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా దక్షిణ ప్రాంతంలో కంపెనీ ఉనికి మరింత బలోపేతం అవుతుంది. దాని ప్రధాన దార్శనికతకు అనుగుణంగా, పిబి పార్ట్‌నర్స్ ఈ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాల వంటి ప్రయత్నాలు ప్రారంభించడం ద్వారా తన ఏజెంట్ భాగస్వాముల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూనే ఉంది. ఇవి నమ్మకాన్ని పెంపొందించడం, ఏజెంట్ భాగస్వాములకు దృఢమైన మద్దతును అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ‘‘దక్షిణాదిన మా విస్తరణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌లో మా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. మా ఏజెంట్ భాగస్వాములను శక్తివంతం చేయడం మా ప్రధాన ప్రాధాన్యతగా మిగిలిపోయింది. ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు చాలా ముఖ్యమైనవి. ఈ మైలురాయి పిబి పార్ట్‌నర్స్‌ను మరింత గొప్ప విజయం వైపు నడిపిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ప్రారంభం నుంచి మేము భారతదేశంలోని ప్రతి మూలకు బీమాను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. మా ఏజెంట్ భాగస్వాములు సంతృప్తి చెందడమే కాకుండా వారి ప్రయాణంలో అవసరమైన వనరులు, మార్గదర్శకత్వంతో పూర్తిగా సన్నద్ధమయ్యారని నిర్ధారించుకునేందుకు మేము అంకితభావంతో ఉన్నాము’’ అని పిబి పార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకుడు ధ్రువ్ సరిన్ వివరించారు.
పిబి పార్ట్‌నర్స్ తన పరిధిని విస్తరిస్తూనే, ఏజెంట్ భాగస్వాములను శక్తివంతం చేయడం, భారతదేశం వ్యాప్తంగా బీమాను అందుబాటులోకి తీసుకురావడం అనే తన లక్ష్యానికి కంపెనీ అంకితభావంతో సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌ను సాధించాలనే పరిశ్రమ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని పిబి పార్ట్‌నర్స్ విశ్వసిస్తోంది.