- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
నూతన సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మోపాల్ మండల్ కాస్బాగ్ తండా సర్పంచ్ సదా సింగ్ కలవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి చేసుకోవాలని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని పిసిసి చీఫ్ తెలపడం జరిగిందని ఆయన తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



