నవతెలంగాణ-మర్రిగూడ
ఐకెపి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలని, నమోదులో అవకతవకలు జరగకుండా చూసుకోవాలని,ధాన్యం కొనుగోలు కూడా వేగవంతం చేయాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి,అక్కడున్న వసతులను స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం అద్దంకి వెంకట్,ఐకెపి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన పీడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



