No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతి కమిటీ సమావేశం

బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతి కమిటీ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
రాబోవు బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలని తహసిల్దార్ శ్రావణ్ కుమార్, రెంజల్ ఎస్సై కే చంద్రమోహన్ పిలుపునిచ్చారు. మంగళవారం రెంజల్ మండలం సాటాపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశం లో వారు మాట్లాడారు. కులమతాలకు అతతంగా  ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు సాటాపూర్ సంతలో క్రయవిక్రయాలు జరుపుకోవాలని వారు సూచించారు. పాడి ఆవులను, లేగా దూడలను క్రయవిక్రయాలు జరప రాదని వారు పేర్కొన్నారు. నిబంధనలను మించి పశువులను అధిక మొత్తంలో తరలించినట్లయితే కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. రెండు వారాలు పశు వైద్య అధికారులు సంతలో అందుబాటులో ఉండి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారని వారన్నారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవటానికి హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంతో కలిసి ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రెంజల్ ఎస్సై ఈ చంద్రమోహన్, అసిస్టెంట్ పశు వైద్యాధికారి గంగరాజు, గ్రామ కార్యదర్శులు మహబూబ్ అలీ, రాజేందర్ రావ్, రాఘవేందర్ గౌడ్, సాయిలు, సునీల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad